Earthquake : అల‌స్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

TRINETHRAM NEWS

Trinethram News : అమెరికాలోని అలస్కాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. శాండ్ పాయింట్ ద్వీపానికి దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో, 20.1 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం నమోదైంది.

ఈ ఘటనతో దక్షిణ అలస్కా, అలస్కా ద్వీపకల్పంలో సునామీ హెచ్చరిక జారీ చేశారు. హెచ్చరిక తర్వాత, స్థానికులు ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే, తర్వాత ఈ హెచ్చరికను సునామీ అడ్వైజరీగా తగ్గించి, చివరికి రద్దు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Massive earthquake hits Alaska

You cannot copy content of this page

Scroll to Top