
ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు.
Mass Protest : దేవరకొండ డివిజన్ ఆగస్టు 01, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పరిధి లోని జాతీయ రహదారి(167) పక్కన గల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉన్న ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి నిరసిస్తూ శనివారం రోజు స్థానిక మహిళ లు కాలనీవాసులు ఖాళీ బిందెలతో జాతీయ రహదారిపై బైఠాయించి మహాధర్నా నిర్వహించారు.
సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా ఎక్కడికక్కడే నిలిచిపోయింది గత కొన్ని రోజులుగా కాలనీలో తీవ్రంగా తాగునీటి సమస్య ఉన్నప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో తాము రోడ్ ఎక్కాల్సి కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు మిషన్ భగీరథ నీరు రాక చాలా రోజులవుతుందని రోజువారి అవసరాలకు కూడా నీరు లేక నరకం చూస్తున్నామని మండిపడ్డారు.
-నిరసనకారులతో మాట్లాడిన అధికారులు:—
రోడ్డుపై సంపూర్తిగా మిగిలిపోయిన సివిల్ పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కాలనీ నిర్వహణను వెంటనే దేవరకొండ మున్సిపాలిటీకి అప్పగించాలని అప్పుడే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వారు స్పష్టం చేశారు ధర్నా విషయం తెలుసుకున్న దేవరకొండ మున్సిపల్ కమిషనర్ రాయదుర్గారెడ్డి సీఐ వెంకటరెడ్డి తమ సిబ్బందితో కలిసి వెంటనే స్థలానికి చేరుకున్నారు నిరసనకారులతో మాట్లాడి రోడ్డుపై నుంచి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు మున్సిపల్ కమిషనర్ రాయదుర్గా రెడ్డి మాట్లాడుతూ కాలనీలోనే తాగునీటి ఇబ్బందులను మిగిలిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కమిషనర్ సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడంతో కాలనీవాసులు తమ ధర్నాను విరమించుకున్నారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంతో వాహనాల రాకపోకలు యధావిధిగా సాగాయి..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe