Masala Shiva Arrested : మసాలా శివ అరెస్టు

TRINETHRAM NEWS

కృష్ణాజిల్లా : మార్చి 12 :(త్రినేత్రం న్యూస్); గుడివాడలో బెట్టింగుకు పాల్పడిన మసాలా శివ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడని ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా కొడాలి నాని పై బెట్టింగ్ క్యాసినో నడిపిన ఆరోపణలు ఉన్నాయి.

శివ అరెస్టుతో కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల కొడాలి నాని అరెస్టులకు భయపడేది లేదని, గరిష్టంగా వంద రోజులు జైలుకు పంపగలరని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు తప్పదనే ప్రచారం ఊపొందుకుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Masala Shiva arrested

You cannot copy content of this page

Scroll to Top