త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. అనుమానస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆర్మూర్ కు చెందిన ఆశ్వీని (38)ని వికారాబాద్ కు చెందిన నాగేశ్ కు ఇచ్చి 15 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. రాత్రి నాగేష్ అత్తగారి ఇంటికి ఫోన్ చేసి మీ కూతురు చంపుతేనే నాకు ఆస్తి ఇస్తామని చెబుతున్నారని మీరు వచ్చి మాట్లాడాలని చెప్పగా వారు రేపు వస్తామని చెప్పారు తిరిగి రాత్రి 12 గంటలకు చనిపోయిందని తెలిపారు ఈ విషయంలో భర్త నాగేష్ మద్యం మత్తులో గొడవలు చేసేవాడని బంధువుల సహకారంతో హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని మృతురాలి తల్లి చంద్రకళ తెలియజేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


