Trinethram News : May 19, 2025, ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. సోమవారం రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 08:54 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించాయని NCS తన ట్వీట్ ద్వారా ప్రకటించింది. అయితే ఈ ఘటనలో తక్షణ ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


