చుట్టపు చూపుగా వస్తున్నా ఉపాధ్యాయులు.
విధులకు ఉదయం అరగంట సాయంత్రం అరగంట.
- ప్రైవేట్ వ్యాపార సంస్థల్లో చేరి పాఠశాలలకు డుమ్మా.
డిండి (గుండ్ల పల్లి) అక్టోబర్ 14 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలో పలు పాఠశాలలు మూసివేసి ఉన్నాయి. ఖానా పూర్ వద్ద ఒక ప్రాథమిక పాఠశాల మూతబడి ఉన్నది. ఇంతకుముందు వున్న బిల్డింగ్ సరిపోవడంలేదని ఉపాధ్యాయులు కోరగా ,కొత్త బిల్డింగ్ ను ప్రభుత్వం కట్టించిన ఉపాధ్యాయులు లేక (సమయానికి రాక)పాఠశాల మూసివేయడంతో అందులో ఉన్న విద్యార్థులు ప్రత్యామ్నాయంగా వేరే పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఈ విధంగా చాలా చోట్ల ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలుస్తోంది.
మండలంలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు చుట్టపు చూపుగా పాఠశాలలకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మండలంలో పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు ప్రైవేట్ వ్యాపార సంస్థలలో చేరి విధులకు డుమ్మా కొడుతున్నారని వినికిడి. వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు పాఠశాలకు వచ్చి హాజరై అరగంట తర్వాత వెళ్లిపోయి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి విధులను నిర్వహించినట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
దీనికి ప్రధాన కారణం ఎంఈఓ పర్యవేక్షణ కొరవడినట్లుగా ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా విద్యాధికారులు వెంటనే స్పందించి మండలంలోని అన్ని పాఠశాలను క్షుణ్ణంగా పరీక్షించాలని విధులపట్ల ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


