WhatsApp Image 2023 12 11 at 10.35.32 PM
తనను అనవసరంగా దూషించారంటూ చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై మన్సూర్ అలీ ఖాన్ మద్రాస్ హైకోర్టులో పరువునష్టం కేసు వేశారు.
అయితే, విచారణ సందర్భంగా తమిళ నటుడికి కోర్టు మొట్టికాయలు వేసింది. బహిరంగంగా తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు త్రిషనే నీపై కేసు పెట్టాలని కోర్టు వ్యాఖ్యానించింది.
“మీకు గొడవల్లో తలదూర్చడం బాగా అలవాటైపోయింది ప్రతిసారి వివాదం రేకెత్తించడం, ఆ తర్వాత నేను అమాయకుడ్ని అనడం మీకు పరిపాటిగా మారింది” అంటూ న్యాయస్థానం మన్సూర్ అలీఖాన్ ను తప్పుబట్టింది. సమాజంలో ఎలా మెలగాలో నేర్చుకోవాలని న్యాయమూర్తి హితవు పలికారు.
