జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 29 at 17.10.39

TRINETHRAM NEWS

ప్రజల ఇబ్బందులు తీర్చడానికే “మన ఊరు -మన ఎమ్మెల్యే ” కార్యక్రమం – కందుల.

త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం. ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని 9 వ వార్డులో “మన ఊరు -మన ఎమ్మెల్యే” కార్యక్రమంలో పాల్గొని వార్డులో ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వార్డులో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు వార్డ్ లో డ్రైనేజ్ సమస్య అధికంగా ఉందని, చెరువును కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసి ఇల్లు నిర్మించారని దానితో చెరువు కట్టపై నడవడానికి కూడా వీలు లేకుండా పోయిందని, ఆర్టీసీ బస్టాండ్ లోని మరుగుదొడ్ల వ్యర్ధాలు రోడ్లపైకి వస్తున్నాయని ప్రజలు గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ రోడ్లు ఒక రోడ్డుపై మళ్ళీ లేయర్ వేయడంతో సిమెంట్ రోడ్డు ఎత్తు పెరిగి మురుగు కాలువల్లో ప్రవహించకుండా ఆగిపోతుందని ఈ సమస్యను అధికారులతో చర్చించి త్వరలోనే పరిష్కారం చూపుతానని అన్నారు. చెరువు కట్టను కొంతమంది కబ్జా చేసి ఇల్లు నిర్మించారని దానితో చెరువు కట్టపై నడవడానికి వీలు లేకుండా పోయిందని త్వరలోనే దీనిపై ఎంక్వయిరీ చేసి సమస్యకు పరిష్కారం చూపిస్తానని మాట ఇచ్చారు.
ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మరుగుదొడ్ల నుంచి వ్యర్ధాలు రోడ్లపైకి రాకుండా పటిష్టమైన సెప్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేయిస్తానని అన్నారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు ఎప్పుడైనా రావచ్చునని ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి సన్నిధిలో ఫిబ్రవరి 4వ తేదీన జరగబోయే శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి రథసప్తమి వేడుకల గోడ పోస్టర్ ను పాంప్లెట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరెవరి నాలుగో తేదీన జరగబోయే రథసప్తమి వేడుకలను రథసప్తమి కమిటీ ఆధ్వర్యంలో గతంలో కన్నా విన్నుతంగా, మిన్నగా వేడుకలను నిర్వహిస్తామని, ప్రజలందరూ సహకరించాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page