WhatsApp Image 2024 01 07 at 1.32.39 PM
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో గుండెపోటుతో వ్యక్తి మృతి
Trinethram News : మహబూబాబాద్ జిల్లా: జనవరి 07 మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం రాంబాబు అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చాడు.
ఈ క్రమంలో రాంబాబు ఛాతిలో నొప్పి అంటే ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో కంగారు పడిన అతడి భార్య కేకలు వేయగా.. స్థానికులు వచ్చి అతడికి సీపీఆర్ చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో రాంబాబు స్పాట్‌లోని చనిపోయాడు.
అయితే, రాంబాబుకు గుండెపోటు రాగా సాటి ప్రయాణికులు అతడికి సీపీఆర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
