వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అమరుల స్తూపం వద్ద తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాల్గవ మహాసభలకు సంబంధించిన కరపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి కాబోతున్నది రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు 40, సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం నడిపారు ఈ క్రమంలో ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు వ్యక్తులుగా శక్తులుగా సంస్థలుగా తెలంగాణ సమాజం సంవాదం నడిపింది సంభాషించింది రగిలిపోయింది మొదటి దశ తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యోగులు విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు 360 మంది విద్యార్థులు పోలీసుల తుటాలకు బలయ్యారు తర్వాత కాలంలో ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతూ తెలంగాణ ఆకాంక్షలు సజీవంగా ఉంచారు. 90వ దశకంలో దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు మరోసారి ఎజెండ పైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో తెలుగు నేలలో ప్రధాన విప్లవ పార్టీ గా ఉన్న పీపుల్స్ వార్ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలపరిచే డాక్యుమెంట్ను విడుదల చేసింది ఆ డాక్యుమెంట్ ప్రజలను ప్రజా స్వామికవాదులను మేధావులను కళాకారులను విశేషంగా ప్రభావితం చేసింది ఈ క్రమంలో భువనగిరి డిక్లరేషన్ సూర్యాపేట డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్లు తెలంగాణ సమాజంలొ పెద్ద కదలికను తీసుకువచ్చాయి. మేధావులు ఒకవైపు కవులు కళాకారులు మరోవైపు సాహిత్య కృషి చేశారు. తెలంగాణ జన సభ.
తెలంగాణ ఐక్యవేదిక.
తెలంగాణ మహాసభ.
తెలంగాణ సంస్కృతి వేదిక.
తెలంగాణ స్టడీ ఫోరం. వంటి సంస్థలు ఏర్పాడి నిర్మాణాత్మక కృషి చేశాయి. 2001లో కొందరు పార్లమెంటరీ రాజకీయ నాయకుల తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించి హత్యలు దాడులు బెదిరింపులు అరెస్టులు కొనసాగించారు. పార్లమెంటరీ రాజకీయ నాయకులు కూడా అనేక పరిమితులు విధించారు. ఈ కారణాల వల్ల తెలంగాణ ఉద్యమంలో స్తబ్దత ఏర్పడింది. ఇది గమనించిన ఉద్యమకారులు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ గా ఏర్పడి. క్షేత్ర స్థాయి ఉద్యమాలకు పూనుకున్నారు. అమరుడు గద్దర్ నాయకత్వంలో ఉద్యమకారులందరూ తెలంగాణ వ్యాప్తంగా శాంతియాత్ర చేశారు.
ఈ కాలంలోనే రాజశేఖర్ రెడ్డి మరణం కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ సమాజంలో కదలిక తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నట్లు ప్రకటించి వెనువెంటనే వెనక్కి తగ్గింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ ఏర్పడింది. రాజకీయ జేఏసీ ఉనికి లోకి వచ్చింది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం లో దోబూచులాట మొదలైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో. తెలంగాణ ఉద్యమకారులందరూ ఏకమై 2010 అక్టోబర్ 9న అమరుడు గద్దర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టిపిఎఫ్) ఏర్పడింది.
పార్లమెంట్లో తెలంగాణ బిల్లులు ప్రవేశపెట్టాలని డిమాండ్ తో తెలంగాణ ప్రజా ఫ్రంట్ పని చేసింది.2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొత్త రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులు అమలు కోసం అనేక ఉద్యమాలు నిర్వహించింది కేసీఆర్ అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజిలేకుండా సంస్థ పోరాడింది ఈ క్రమంలో కెసిఆర్ ప్రభుత్వం 2018 నుంచి నిర్బంధాన్ని అమలు చేసి తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులను కార్యకర్తలు అరెస్టు చేసి జైలు పాలు చేసింది.
అయినా కూడా సంస్థ తిరిగి తన బలాన్ని కూడగట్టుకుని ప్రజల్లో పనిచేస్తూనే ఉంది ఈ క్రమంలో రాష్ట్ర నాలుగో మహాసభలు జరుపుకోవడానికి సంసిద్ధమయింది. ఈ సభకు ప్రజలు ప్రజాస్వామిక వాదులు విద్యార్థులు మేధావులు బుద్దిజివులు పౌరసమాజం రైతులు కార్మికులు యువత అనగరిన సంబండ వర్గాల ప్రజలు.అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యార్థులు కార్మికులు రైతులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈనెల 28,29 తేదీలలో హైద్రబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కర్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం ..చైతన్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు స్వార్ణలత.. చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అలివేలు.. చైతన్య మహిళా సంఘం సభ్యురాలు.. లక్ష్మి యం అర్ పి యస్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పుస్పరాణి.. సీను ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


