Welfare Board Schemes : సంక్షేమ బోర్డు పథకాల అమలుకై 12 న జరిగే సదస్సును జయప్రదం చేయండి

TRINETHRAM NEWS

భవన నిర్మాణ కార్మికులకు పథకాల అమలపై ప్రభుత్వం పండగలోపు తీపి కబురు తెలియజేయాలి…

త్రినేత్రం న్యూస్, కాకినాడ, డిసెంబర్,10: ఆంధ్ర ప్రదేశ్ బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్క్ స్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలు అమలుకే కాకినాడలో సాంబమూర్తి నగర్ రెవెన్యూ కాలనీ రోడ్ పి.ఆర్ భవన్లో డిసెంబర్ 12న శుక్రవారం ఉదయం జరిగే సదస్సును జయప్రదం చేయాలని, ఈ సదస్సుకు తాపీ మేస్త్రీలు, ఎలక్ట్రిషన్లు, పెయింటర్లు, ప్లంబింగ్, వడ్రంగి తదితర రంగాల కార్మికులు హాజరు అవ్వాలని ఏపీ బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పిలుపు నిచ్చారు. బుధవారం ఉదయం కాకినాడలో నిర్మాణ రంగ కార్మికుల అడ్డాల వద్ద సదస్సు కరపత్రాలు పంపిణీ చేసి విస్తృతంగా వీర్ కమల్ సెంటర్, కరణం, సెంటర్, కొండయ్యపాలెం, దుర్గా నగర్, గుడారిగుంట, అయోధ్య నగర్, దుమ్ములపేట, గ్లాస్ హౌస్ సెంటర్,జై రామారావు పేట తదితర ప్రాంతాల కార్మికుల అడ్డాల వద్ద సదస్సు కోసం విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది.

దీనికి ముఖ్య అతిథి గా ఏపీ బిల్డింగ్ మరియు,కన్స్ట్రక్షన్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ క్లెయిమ్స్ 110 కోట్లు నిధులు ఉన్నాయని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారు ఐదు కోట్ల రూపాయలు పైగా క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయని, భవన నిర్మాణ కార్మికులకు క్లెయిమ్స్ నిధులు మంజూరు చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 70 కోట్లు నిధులు కేటాయిస్తున్నా రని, ఎన్ని కోట్లు నిధులు కేటాయించిన స్థానికులకు పనులు కల్పించకుండా ఇతర రాష్ట్రాల వారికే పనులు కల్పిస్తున్నారని పథకాల అమలు చేయడంలో పాలకులు విఫలం చెందుతున్నారని ఆయన అన్నారు. వాడ దాటకముందు వాడ మల్లన్న వాడు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే చందంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల రాకముందు భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చిందని, భవన నిర్మాణ కార్మికుల ఓట్లతో గద్దెనెక్కి మాట మార్చుతున్నారని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కార్మిక శాఖ మంత్రికి ఎన్నిసార్లు
వినతి పత్రాలు అందజేసిన ప్రతిఫలం లేదని, కార్మిక శాఖ మంత్రి కి భజన చేసే ఆత్మగౌరవ సభలు ఎన్ని నిర్వహించిన ప్రయోజనం లేదని, ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం కావాలని, పండగ లోపు భవన నిర్మాణ కార్మికులకు పథకాలు అమలపై ప్రభుత్వం తీపి కబురు తెలియజేయాలని, లేదంటే పండగ తర్వాత భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కలిసి వచ్చిన సంఘాలన్నిటిని కలుపుకుని పథకాల అమలు చేసే వరకు ఉద్యమిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నమ్మి బాలకృష్ణ, సత్యనారాయణ, వినోద్ కుమార్, త్రినాధ్, సూరిబాబు, రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

implementation of welfare board schemes a success...

You cannot copy content of this page

Scroll to Top