- ఐఎన్ఎ మాజీ ఉపాధ్యక్షులు పల్ల సుబ్రహ్మణ్యం..
- వేమగిరి బుద్ధ విహారంలో ‘ఆయుర్వేద ప్రాక్టీషనర్స్’ శిక్షణా కార్యక్రమం
త్రినేత్రం న్యూస్, కడియం,:కడియం మండలం వేమగిరి బుద్ధ విహార ప్రాంగణంలో లయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ శిక్షణా కార్యక్రమం రెండు రోజులపాటు ఉత్సాహంగా సాగింది.ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా అఖిల భారత నర్సరీ సంఘం మాజీ అధ్యక్షులు పల్ల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో ఆచార సంప్రదాయంగా కొనసాగుతున్న వనమూలిక వైద్యాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చేందుకు లయ సంస్థ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగకరం అన్నారు.
లయ సంస్థ కోఆర్డినేటర్ గుగ్గిలపు బుల్లియ మాట్లాడుతూ ఒకప్పుడు దేవ వైద్యంగా ప్రసిద్ధి పొందిన వనమూలిక వైద్యాన్ని సంరక్షించటం మా సంస్థ ముఖ్య ధ్యేయం. గిరిజన యువతకు పూర్వీకుల వైద్య సంపదను పునరుద్ధరించేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో బ్యాచ్‌ల వారీగా 20–25 మంది చొప్పున ఇప్పటివరకు ఆరు బ్యాచులలో 126 మందికి శిక్షణ అందించినట్లు ఆయన వివరించారు.
శిక్షణా తరగతులలో అడవులు,మైదాన ప్రాంతాల్లో లభించే వనమూలికల పరిచయం, ఆయుర్వేద మందుల తయారీ, వినియోగ పద్ధతులు,నిర్దిష్ట వ్యాధులకు అనువైన మూలికల ఎంపిక,అంతరించిపోతున్న అరుదైన ఔషధ మొక్కల సంరక్షణ,ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ప్రసిద్ధ ఫార్మసీలకు విద్యార్థుల అధ్యయన పర్యటన,వ్యక్తిత్వాభివృద్ధి, ప్రజాసేవా దృక్పథంపై శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.
అలానేశిక్షణను పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. ఈకార్యక్రమానికి హాజరైన కడియం గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు శెట్టి సత్యనారాయణ ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యతపై విలువైన సూచనలు అందించారు. శిక్షణార్థులతో కలిసి వేమగిరి బుద్ధ విహార్, స్థానిక నర్సరీలను సందర్శించినట్లు బుల్లియ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు ఆకాశం గౌరీష్ బాబు, వెంకటేశ్వరరావు(పాలెం డాక్టర్) చంద్రశేఖర్,బుద్ధ విహార్ యార్లగడ్డ జగదీశ్వర్ రావు తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


