
Surveyor Caught : పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 17: (త్రినేత్రం న్యూస్) ; జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం మండలం మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కాడు. స్థలం సర్వే రిపోర్టు కోసం ఒక యాజమాని నుంచి రూపాయలు యాభై వేలు లంచం తీసుకుంటూ ఉండగా సంబంధిత అధికారులు పట్టుకున్నారు. రామకృష్ణ పలుమార్లు అవినీతికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సర్వేయర్ సిబ్బంది కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

