Trinethram News : రాయ్‌పూర్, జూన్ 05: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. జిల్లాలో విస్తరించిన నేషనల్ పార్క్‌లో కాల్పులు కొనసాగుతోన్నాయి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు.. ఆ ప్రాంతానికి చేరుకొని కూంబింగ్ చేపట్టాయి.
ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రత బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. అవి ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. వారిలో అగ్రనేత ఉన్నట్లు పేర్కొంటున్నాయి. ఈ ఘటన స్థలంలో అగ్రనేత మృతదేహంతోపాటు కొన్ని ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


