-భారీ ఎత్తున ర్యాలీ.
దేవరకొండ ఆగష్టు 29 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం నల్గొండ దేవరకొండ జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ నుండి ర్యాలీని ఐ పి ఎస్ మౌనిక , అధ్యక్షుడు ఎన్ వి టీ, సి ఐ వెంకట్ రెడ్డి, ముత్యాల సర్వయ్య, శ్రీశైలం యాదవ్ సభ్యులతో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం బాయ్స్ హై స్కూల్ నుండి దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహం వద్దకు ర్యాలీగా వస్తు విద్యార్థులు క్రీడాకారుల ఐక్యత వర్ధిల్లాలని దేవరకొండ నియోజకవర్గానికి స్టేడియాలు కావాలని దద్దరిల్లే విధంగా నినాదాలు ఇవ్వడం జరిగినది. ఐపీఎస్ మౌనిక , అధ్యక్షుడు ఎన్ వి టి సభ్యులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులు ర్యాలీ నిర్వహించడం గర్వించదగ్గ విషయమని, యువత చదువులో ముందుండాలని ఇప్పుడు మనం ఏది పోగొట్టుకున్న తర్వాత సాధించలేమని మత్తు పదార్థాలకు అలవాటు పడరాదని ఇన్ స్ట్రా గ్రామ్ యూట్యూబ్లో జాగ్రత్తగా ఉండాలని ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసం కష్టపడాలని, తల్లిదండ్రులకు ఇబ్బంది అయ్యే విధంగా నడవరాదని అన్నారు. అధ్యక్షుడు ఎన్ వి టీ మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క స్కూలు యజమాన్యానికి సిబ్బందికి విద్యార్థులకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు పత్రిక విలేకరులకు, పి ఈ టీ లకి, క్రీడాకారులకు కళాకారులకు ప్రతి ఒక్కరికి దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసినారు. దేవరకొండ లో ఇప్పటికైనా స్టేడియాలు నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్, రాపోలు నిరంజన్, బత్తుల అమర్, తాళ్ల సురేష్ ,సన్నీ, ముత్యాల రవి, డాన్స్ మాస్టర్ ఏడుకొండలు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గానుగుల ఆంజనేయులు, కరాటే మాస్టర్స్ చైతన్య, గోపి కాజా, ఫోటోగ్రాఫర్ నరేష్, చిత్రం వినోద్ విద్యార్థి సంఘం నాయకులు వేముల రాజు, వల్లమల్ల ఆంజనేయులు, వంగూరు వెంకటేశ్వర్లు బోడిగ వెంకటేష్ చింతపల్లి సతీష్ గౌడ్ ,నక్క సుజిత్ గణేష్,శివ,గంగరాజు, రాజేశ్, సౌబన్, జిమ్ మాస్టర్స్ వంశీ సాబేర్, ప్రేమిక మౌనిక నిత్య రాకేష్ జమీర్ మధు లక్ష్మణ్ క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


