కూకట్ప ల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 2 : ఇటీవల మృతి చెందిన కొరదాల పుల్లమ్మ పెద్దకర్మ సందర్భంగా సాయిబాబానగర్ లోని నివాసంలో ఆమె చిత్రపటానికి ఆదివారం దీనబంధుకాలనీ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.మహేందర్ నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పుల్లమ్మ తనయుడైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివేకానంద విద్యాసంస్థల అధినేత డాక్టర్ కొరదాల నరేష్ ను ఈ సందర్భంగా మహేందర్ నాయక్ పరామర్శించి సానుభూతి తెలిపారు. పుల్లమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మహేందర్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, స్థానికులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


