- మనమంతా ఒకే కుటుంబం
- కేసులు పెట్టారు… జైలుకు పంపారు… ఎక్కడా తొనకలేదు… బెదరలేదు
- కడపలో జరిగే మహానాడును విజయవంతం చేద్దాం
- కనీవినీ ఎరుగని రీతిలో పుష్కరాలు
- జిల్లా స్థాయి మహానాడులో జోన్`2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు… ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
- జెండా మోసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది
- వైకాపా పాలనలో గత ఐదేళ్లు ప్రజలు నరకం అనుభవించారు
- ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుంది
- కడప మహానాడుకు లక్షలాదిగా తరలివెళదాం… విజయవంతం చేద్దాం
- ఎమ్మెల్యేలు ముప్పిడి… మద్దిపాటి… రుడా చైర్మన్ బొడ్డు… నేతలు ఆదిరెడ్డి అప్పారావు… బూరుగుపల్లి… గన్ని కృష్ణ… నల్లమిల్లి తదితరులు
- వేలాదిగా తరలి వచ్చిన నాయకులు… కార్యకర్తలు
రాజమహేంద్రవరం :‘‘మహానాడు’’ ఈ పేరు వింటేనే తెలుగుదేశం పార్టీ నాయకలు… కార్యకర్తలు… అభిమానుల్లో మాటల్లో చెప్పలేని ఆనందం, ఒక పులకింత అని తెలుగుదేశం పార్టీ జోన్2 కో ఆర్డినేటర్ ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరావు, మద్దిపాటి వెంకటరాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, అనపర్తి ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి తదితర నేతలు నొక్కి ఒక్కానించారు. తెలుగుదేశం పార్టీ పసుపు పండగ ఈనెల 27, 28 29 తేదీల్లో కడపలో జరిగే తెలుగుదేశం మహానాడును పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి నియోజకవర్గ వర్గాల వారీగా భారీ ఎత్తున జన సమీకరణ చేయాలంటూ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం జెఎన్ రోడ్డులోని చెరుకూరి కన్వెషన్ హాల్లో శుక్రవారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా స్థాయి మహానాడు వేలాదిగా తరలి వచ్చిన నేతలు, కార్యకర్తల మధ్య కన్నుల పండుగవగా జరిగింది. తోలుత తెలుగుదేశం జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నేతలంతా పూలమాల పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జోన్2 కో ఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా పేద, బడుగు వర్గాల పక్షాన నిలబడి వారిని అభివృద్ధి బాట లో నడిపించాలని తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. గత ఐదేళ్ల లో ఒక దుష్టుడి పాలనతో రాష్ట్రం అన్ని రకాలుగాను చిన్నాభిన్నమైందని అన్నారు. ఆ దుష్టుడుని ఎదుర్కోవడానికి పార్టీలన్నీ ఏకమై కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ మంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్రం గత వైభవాన్ని సాధిస్తుందని అన్నారు. గత రాక్షస పాలనలో వేధింపులకు, అక్రమ కేసులకు గురైన పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సమయానికి చాలామంది కష్టపడిన నాయకులకు పదవులు లభించాయని, త్వరలో స్థానిక సంస్థల్లోనూ ఇతరత పదవులు వస్తాయని కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సాధ్యమవుతుందన్నారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న తప్పులు లోటుపాట్లు జరగడం సహజమేనని వాటిని సమర్థించుకొంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
సభకు అధ్యక్షత వహించిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పసుపు పండగ కడపలో జరుగుతుందని ఈ పండక్కి వేలాదిమంది తరలిరావాలని పిలుపునిచ్చారు. గత రాక్షస ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకుల పై, కార్యకర్తలపై అక్రమ కేసులు వేధింపులు గురు చేశారని అలాంటి వారికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు జైలులో ఉంచారని, అలాగే తనను, తన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును కూడా అన్యాయంగా జైలులో ఉంచారని, అన్నింటినీ ఎదుర్కొని నిలదొక్కుకున్నామన్నారు. ఈ సంవత్సరకాలంలో కుటమి ప్రభుత్వం చేపట్టిన బడుగు ,బలహీన వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లు అనేక ఇబ్బందులుపడ్డామన్నారు. ఆ సమయంలో మనం చేసిన పోరాటం వృధ్ధాగా పోలేదన్నారు.
ఉద్యమించాం.. అధికారంలోకి వచ్చామన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టి వాటిని నిర్మూలించామన్నారు. తప్పుడు చేసిన వారిపై తనమన అనే బేధం లేకుండా కఠిన చర్యలు తీసుకుని ప్రశాంతమైన నగరంగా తీర్చిదిద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతో కలిసి సుమారు రూ. 550 కోట్లతో నగరాన్ని పుష్కరాలకు అతి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయాన్ని సాధించామన్నారు. చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని, వాటన్నింటినీ ఒక్కోక్కటికీ చేసుకుంటూ వెళతామన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవం, విశ్వాసానికి తెలుగుదేశం పార్టీ ప్రతీకని, తెలుగు వారి అభివృద్ధిలో విడదీయరానీ అనుబంధం ఉందన్నారు. తెలుగు వారి ఆత్మ తెలుగువారి పౌరుషాన్ని దేశ విదేశాల్లో తెలియ చెప్పిన ఎన్టీఆర్ కు చెప్పిన భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందిగా తీర్మానం చేశారు.
అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ అనపర్తి, బిక్కవోలు కెనాల్ రోడ్డుల అభివృద్ధికి రూ.13 కోట్లు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ, భోగాపురం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని తీర్మానం చేశారు. రాజానగరం నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ నియోజవర్గం నుంచి మహానాడుకు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, ఇటువంటి పెద్ద కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చిన్నచిన్న లోటుపాట్లు ఉండడం సహజమేనని వాటిని సర్దుకుపోవాలని సూచించారు. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి వేధించారని అలాంటి రాక్షస గణానికి ప్రజలు పెద్ద మెజారిటీతో గుణపాఠం చెప్పారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు, యువ మంత్రి లోకే ష్ ల నాయకత్వానికి నగర ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ, 40 సంవత్సరాలుగా పేద బడుగు వర్గాల పక్షాన నిలబడిరదని ఇలా నిలబడి న పార్టీ దేశంలో ఏ పార్టీ లేదన్నారు.
గత ప్రభుత్వంలో ఇసుక మద్యం మాఫియాలు భూకబ్జాలు నీతి వేలకోట్ల అవినీతిగా యదోచ్చగా జరిగాయని విమర్శించారు. గుడా మాజీ చైర్మన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే స్వర్గీయ ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడులు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి మూల కారకులని అన్నారు. కడపలో జరిగే మహానాడుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణు గోపాల రాయుడు మాట్లాడుతూ కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు పార్లమెంట్ స్థాయిలో అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. మహానాడు భారీ ఎత్తున విజయవంతం చేయడం వల్ల గత పాలకుడికి కనువిప్పు చేయాలని సూచించారు.
ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడుపూడి సత్తిబాబు తదితర రాష్ట్ర నాయకులు మాట్లాడారు. రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధాల పర్యవేక్షణలో జరిగిన ఈ మహానాడులో టిఎన్‌టియూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు 2027 గోదావరి మహా పుష్కరాలు, టిడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ ఎస్సీల అభ్యున్నతి కోసం, మజ్జి రాంబాబు బీసీ కులాల అభివృద్ధి కోరుతూ, రాష్ట్ర మహిళ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల మహిళల అభ్యన్నతి కోరుతూ, యం.డి అస్లాం మైనారిటీల తీర్మానాలు, అలాగే ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పలు తీర్మానాలను ప్రవేశపెట్టగా అందరూ ముక్తకంఠంతో ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.


