TRINETHRAM NEWS

Maha dharna under INTUC against Singareni Pravetikaran, RG-1 GM office siege

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గురువారం INTUC సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ ఆదేశానుసారం సింగరేణి ప్రవేటికరణ కి వ్యతిరేకంగా మొదటి విడుత గా సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలలో GM ఆఫీస్ల యందు మహా ధర్నా కార్యక్రమంలో భాగంగా INTUC RG-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం అధ్యక్షత RG-1 GM ఆఫీస్ యందు మహా ధర్నా GM ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి హాజరై ప్రసంగిస్తూ ..

100 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి ను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఇక్కడ వేలాది కార్మికుల నోట్ళో మట్టి కొట్టాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక మరియు సింగరేణి ప్రాంత అభివృద్ధి వ్యతిరేక చర్యల వల్ల తెలంగాణా బిడ్డలు గడిచిన పది సంవత్సరాలలో ఎటువంటి అబివృద్ధి లేకుండా అప్పుల తెలంగాణ గా గత BRS పాలకులు చేసి నిరుద్యోగుల జీవితాల తో ఆడుకున్నారని .
అధికారం లో ఉన్న 10 ఏళ్లు కేంద్రం లో ఉన్న బి. జే. పి తో అంటకాగి, MMDR-2015 చట్టానికి తెలంగాణ ప్రాంత BRS 13 మంది ఎం.పీ లు మద్దతు తెలియజేసి ప్రయివేటీకరణ ను ప్రోత్సహించారని .

పేదలను కొట్టి పెద్దలకు సంపద ను దోచి పెట్టాలన్న సిద్ధాంతం తో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని. ఇదేనా వికసిత్ భారత్ ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని
100 ఏళ్లు చరిత్ర 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం గల సింగరేణి ఉనికే లేకుండా చేస్తాము అని ఆలోచిస్తే మరో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని .

MMDR ఆక్ట్ లో 17(A) క్లాస్ ప్రకారం బొగ్గు బ్లాకుల ను ప్రభుత్వ రంగ సంస్థలకు అలాట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలిసి కూడా వేలం వేయడం దేనికి సంకేతమని అంతే కాకుండా సింగరేణి సంస్థ కు బొగ్గు ఉత్పత్తి లో అపార అనుభవం ఉందని కోల్ ఇండియాకి దీటుగా ఉత్పతి సాధిస్తుందని వరుస లాభాలు గడిస్తూ, కార్మికులు కష్టపడేతత్వం గల వాళ్ళు ఉండి మంచి అధికారులు కూడా ఉన్నపుడు ఇవ్వన్నిటినీ పరిగణ లోనికి తీసుకోకుండా పెట్టుబడి దారుల జేబులు నింపడమేనా బి.జే.పి అంత్యోదయ నినాదమని.


గతం లో కాంగ్రెస్ నాయకురాలు దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఇప్పుడున్న బి.జే పీ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ను వారి స్నేహితులైన పెద్ద పెద్ద పెట్టుబడి దారులకు అప్పజెప్పుతున్నారని .
అందుకే INTUC తరుపున ఈ బొగ్గు బ్లాకుల విషయమై తెలంగాణ ముఖ్య మంత్రి ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క గార్ని,IT శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు మరియు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి అలాగే ప్రభుత్వ పెద్దలను ఈ సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేల ను కలిసి బొగ్గు బ్లా సింగరేణి సంస్థ కే ఇవ్వాలని కోరుతామని .
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ కు ఇట్టి బొగ్గు బ్లాకుల ఇవ్వని ఎడల మా INTUC జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి నాయత్వములో సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో విడుదల వారీగా పోరాటాలు చేయటం కోసం కార్యాచరణ చేశామని అందులో బాగంగా మొదటి విదుత లో బాగంగా ఈ రోజు GM ఆఫీస్ యందు మహా ధర్నా GM ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించామని తదుపరి కార్యాచరణ కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జి వికాస్ కుమార్ యాదవ్ , సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రెటరీ అరేపల్లి శ్రీనివాస్ , సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రెటరీ దేవులపల్లి రాజేందర్ , సెంట్రల్ సెక్రెటరీలు బత్తుల పోచయ్య , మల్లికార్జున్ , గడ్డం కృష్ణ , బ్రాంచ్ సెక్రెటరీలు నాగరాజు , బుర్ర జగన్మోహన్ , నీరాటి సాగర్ , గుందేటి శ్రీనివాస్ , ఎడులాపురం శ్రీనివాస్ , బ్రాంచ్ నాయకులు లగిషెట్టి ఆంజనేయులు, మండ రమేష్ , పుట్ట రమేష్ , తాళ్ళ కుమార్ , నయీం పాషా , గంగాధర్ , దాసరి నర్సయ్య ,
పిట్ సెక్రెటరీలు జనగామ రాజేశం , సిరిపురం నర్సయ్య , సదానందం , దేవేంద్ర చారి , గాదె సంపత్ , అశోక్ చక్రవర్తి , శ్రీనివాస్ , పర్వేశ్ , కొండ శ్రీనివాస్ , ఇతర నాయకులు కట్రోజు మోహన్ , పాకాల సాయి , హరీష్ , మంత్రి మల్లయ్య , తాటి రాజయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Maha dharna under INTUC against Singareni Pravetikaran, RG-1 GM office siege