జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 04 at 16.32.24

TRINETHRAM NEWS

District Collector Koya Harsha inspected Manthani MLS point

మంథని, జూలై-04: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మంథని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉన్న మంథని ఎం.ఎల్.ఎస్ పాయింట్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఎం.ఎల్.ఎస్ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, గూడ్స్ రిజిస్టర్ రికార్డులను, ఆన్ లైన్ రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా విధానాన్ని కలెక్టర్ ఆరా తీశారు.

స్టేజ్ 2 కాంట్రాక్టర్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేస్తున్నామని, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ వారు ఎం.ఎల్.ఎస్ పాయింట్ కు వచ్చి ఈపాస్ యంత్రం ద్వారా స్టాక్ తీసుకుని వెళ్తారని ఎం.ఎల్.ఎస్. పాయింట్ అధికారి డిప్యూటీ తహసిల్దార్ టి.మీనా భాయ్ కలెక్టర్ కు వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector Koya Harsha inspected Manthani MLS point

You cannot copy content of this page