జూలై 16, 2026

WhatsApp Image 2024 11 26 at 18.35.36

TRINETHRAM NEWS

మాదిగ మిత్రమండలి మాదిగల ఆత్మీయ సమ్మేళనము మాదిగ బాంధవుల సన్మాన కార్యక్రమం

ముఖ్యఅతిథి ఆసంపల్లి శ్రీనివాస్ ( వాసు)
మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్ లో కోటగిరి పాపన్న ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమమునకు మాదిగ మిత్ర మండలి వ్యవస్థాపకులు వాసంపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగము 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగిందని అన్నారు అదేవిధంగా మాదిగలు, మాదిగల జీవన విధానం రాజకీయ చైతన్యం విద్యా ఉద్యోగ అంశాలపై మాట్లాడుతూ మాదిగ కులానికి చెందిన పారిశుద్ధ కార్మికులు డప్పు కళాకారులు మరియు పాత్రికేయ మిత్రులు డాక్టర్స్ లాయర్లకు సంబంధించిన వివిధ విభాగాలలో పనిచేస్తున్న మాదిగల అందరికీ సన్మాన కార్యక్రమం చేసి వారిని సత్కరించడం జరిగింది. ఇది తొలి దశ అని రాబోయే రోజులలో మాదిగల చైతన్యం కొరకు మాదిగ మిత్రమండలి అనునిత్యం ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ మాదిగలను చైతన్య పరుస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతం చేసిన మాదిగ బిడ్డలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఉప్పులేటి పర్వతాలు రాసపల్లి రవికుమార్ పల్లె బాబు మాతంగి కుమార్ మాదిగ హక్కుల దండోరా నాయకులు వడ్లూరు శ్రీనివాస్ పులిపాక శ్రీహరిలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page