
- బాధ్యతలు చేపట్టిన 320 బి జిల్లా నూతన కమిటీ
- అధ్యక్షులు శైలజా నాయర్
- ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా అవంతి రెడ్డి
- సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా చల్లా శ్రీనివాస్ రెడ్డి
Lions International : కూకట్పల్లి జులై 26 (త్రినేత్రం న్యూస్) : లయన్స్ ఇంటర్నేషనల్ లో 320 బి డిస్ట్రిక్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అన్ని క్లబ్ లకు ఆదర్శంగా ఉంటాయని పి ఐ డి లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు అన్నారు. 320 బి డిస్ట్రిక్ట్ 11వ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం కొంపల్లి లోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా 320 బి నూతన గవర్నర్ శైలజ నాయర్, ఫస్ట్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా అవంతి రెడ్డి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చల్లా శ్రీనివాస్ రెడ్డి లతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పి ఐ డి లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు మాట్లాడుతూ జిల్లా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన శైలజ నాయర్ పట్టుదలతో పని చేసే వ్యక్తిత్వం గల వారిని అన్నారు. ఆమె మార్గదర్శకంలో జిల్లాలోని క్లబ్బులు మరింత చురుకుగా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నేత్రదానం ఆవిష్కతను గుర్తు చేస్తూ ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇన్స్టలేషన్ చైర్మన్ హలోక్ కుమార్ జ, డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్లు సెల్వ సాయిరాంరాజు, రాజేంద్రప్రసాద్, ఎస్ ఎన్ రెడ్డి, దీపక్ భట్టాచార్య, విద్యాసాగర్ రావు, విజయ్ కుమార్ శెట్టి, మోహన్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ హేమల్ కన్విద్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe