ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Complaints Yield No Results

Complaints Yield No Results : అనంతగిరి,జూలై 27, (త్రినేత్రం న్యూస్) : అల్లూరి జిల్లా లోని గిరిజన గ్రామాల్లో సమాచార వ్యవస్థను మెరుగు పరిచేందుకు బీఎస్ ఎన్ఎల్ సెల్ టవర్లను ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే, ఇవి సరిగా పనిచేయక వినియోగదారులు తరచూ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సెల్-సిగ్నల్స్ సమస్య ఒక స్థాయిలో తలెత్తుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కొండిబ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ గత నాలుగు రోజులుగా మూగపోయింది. సెల్ఫోన్ సంకేతాలు లేక వినియోగదారులు చాలా ఇక్కట్లు పడుతున్నారు.
వీటిని తిరిగి సంబంధిత అధికారులు పునరుద్ధరించిన రోజుల వ్యవధిలోనే అవి మామూలపు తున్నాయి. కొండిబ గ్రామంలో ఏర్పాటు చేసిన బి ఎస్ ఎన్ ఎల్ టవర్లు సాంకేతికపరమైన సమస్యతో సిగ్నల్స్ రాక వినియోగదారులు. తీవ్ర ఇబ్బందులు ర్కొంటున్నారు. ప్రతి నెలా రీచార్జి డేటా వేసుకుంటున్నా!!!!సిగ్నల్ పనిచేయక డబ్బు వృధా అవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫిర్యాదు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.

నాలుగు రోజులు నుంచి సెల్ టవర్ పనిచేయకున్నా సిబ్బంది ఎటు వంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి అంబులెన్సుకు ఫోన్ చేయాలన్నా, దూరప్రాంతాల్లో ఉన్న తమ బంధువులతో మాట్లా డాలన్నా వీలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికా రులు ఇకనైనా స్పందించి బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు మధుసూదన్, సోమరాజు, మూర్తి, శ్యాం, గురునాద్, పెంట పలువురు డిమాండ్ చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page