Trinethram News : ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన ఆల్ మోస్ట్ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత తెలిపింది. నవంబర్ 10వ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్‌లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో పాటు.. జిల్లాల సరిహద్దుల మార్పులపై క్లారిటీ రానుంది.
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన ఆల్ మోస్ట్ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత తెలిపింది. నవంబర్ 10వ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్‌లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో పాటు.. జిల్లాల సరిహద్దుల మార్పులపై క్లారిటీ రానుంది. 4గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం.. వచ్చిన ప్రతిపాదనలు, సాధ్యసాధ్యాలపై చర్చించింది. రెండ్రోజుల్లో ప్రభుత్వానికి తమ నివేదిక ఇస్తామని, కేబినెట్ మీటింగ్‌లో తుది నిర్ణయం ఉంటుందని మంత్రులు తెలిపారు.
ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో, గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనలకూ మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసింది. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా మరో ఆరు డివిజన్ల వరకు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందులో.. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరతోపాటు నక్కపల్లి, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
జనగణన ప్రకారం డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఏడుగురు సభ్యులతో కూడిన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం ఆగస్టు 13వ తేదీన రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఆ తర్వాత, జిల్లాల వారీగా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాలు, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అలాగే ప్రాంతాల వారిగా వచ్చిన అభ్యర్థనలను ఉపసంఘానికి సమర్పించారు. మొత్తంగా, ఉపసంఘానికి దాదాపు 200 వరకు అర్జీలు స్వీకరించి, పరిశీలించి, మంత్రుల ఉప సంఘం విస్తృతంగా చర్చించింది. ఈ చర్చల్లో భాగంగా జిల్లాల అధికారుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


