దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 22 , త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలోని ముదిగొండ గ్రామంలో భద్రకాళి వీరభద్ర సమేత బ్రహ్మోత్సవాలలో ఈనెల 15 నుండి 22 వరకు భక్తులకు సుమారు 50 వేల మందికి ఉచితంగా మంచినీరును అందించడం జరిగిందని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయానికి వచ్చే భక్తులకు మంచినీరును అందించడం జరిగిందని ప్రధాన అర్చకులు సూచన మేరకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ లకుమారపు మల్లయ్య ట్రెజరర్ కొండూరు ఆంజనేయులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

