త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెంబర్ 64/2015, U/Sec 302 R/w 34 IPC సెక్షన్ లో ఇద్దరు నిందితులకు ఈ రోజు జిల్లా ప్రిన్సిపాల్ & సెషన్స్ జడ్జ్ సున్నం శ్రీనివాస్ రెడ్డి జీవిత ఖైదు మరియు 1000 రూపాయల జరిమానా విధించినారు అని జిల్లా ఎస్పీ తెలిపినారు . అట్టి కేసుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
తేది 02.09.2015 రోజున హరిజన్ ప్రమీలమ్మ మరియు తన కొడుకు హరిజన్ రవి లు ఆవుసుల పల్లి గ్రామం, ధరూర్ మండలం తమ ఇంట్లో ఉండగా అదే రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు అదే గ్రామానికి చెందిన A1)సోమారం సమ్మయ్య,A2)అంతరపు శ్రీనివాస్ లు తన కొడుకుని త్రాగడానికి అని బయటకు తీసుకొని వెళ్లి చంపినారు అని ఫిర్యాదు చేయగా, అప్పటి ధరూర్ పోలీస్ స్టేషన్ SI M. ప్రేమ్ కుమారు కేసు నమోదు చేయడం జరిగింది. అనంతరం అప్పటి ధరూర్ సర్కిల్ CI AV రంగా కేసును ధర్యాప్తు చేసి కేసు వివరాలను గౌరవ జడ్జ్ ముందు పెట్టగా ఈ రోజు గౌరవ జడ్జ్ నిందితులకు జీవిత ఖైదు మరియు 1000 రూపాయల జరిమానా విధించడం జరిగింది అని ఎస్పీ తెలిపినారు.
ఇట్టి కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా పని చేసిన PP సుధాకర్ రెడ్డి,అప్పటి SI యం. ప్రేమ్ కుమార్, CI AV. రంగా, ప్రస్తుత ధరూర్ SI B. అనిత, ప్రస్తుత ధరూర్ CI ఇట్టి కేసు బ్రీఫింగ్ అధికారి Ch. రఘు రాములు, ధరూర్ కోర్ట్ అధికారి జె. శంకర్, లైయసన్ అధికారి B. వీరన్నా లను జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, IPS అభినందించడం జరిగింది .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


