జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 04 at 18.51.24

TRINETHRAM NEWS

Let’s move forward with immortal ambitions

విప్లవోద్యమ నిర్మాణానికి కృషి చేద్దాం.

పెద్దంపేట లో జరిగిన కామ్రేడ్ బండి మైసయ్య వర్ధంతి సభలో ప్రజాపంథా నేత నంది రామయ్య పిలుపు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ప్రజాపంథా సీనియర్ నాయకులు కామ్రేడ్ బండి మైసయ్య ప్రథమ వర్ధంతి సభ జరిగింది.
ఈ సభలో CPI ML మాస్ లైన్ ప్రజా పంథా రాష్ట్ర నాయకులు నంది రామయ్య, కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ భారత దేశ విప్లవోద్యమ చరిత్రలో ఎంతోమంది అమరులు పేద ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారు. భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అలుపెరుగని పోరు కొనసాగించారు. కామ్రేడ్ బండి మైసయ్య విప్లవోద్యమ గడ్డగా పెద్దంపేట గ్రామాన్ని నిలబెట్టేందుకు తన వంతు పాత్రను పోషించాడు. పెద్దంపేట లో జరిగిన అనేక పోరాటాలకు నాయకత్వం వహించాడు. అరుణోదయ కళాకారుడిగా, పార్టీ నాయకుడిగా పార్టీ కర్తవ్యాలను తూచా తప్పకుండా పాటించాడు. తన ఊపిరి ఉన్నంతకాలం ఎర్రజెండాను చేతబట్టి విప్లవోద్యమ నిర్మాణానికి కృషి చేశాడు.

కామ్రేడ్ బండి మైసయ్య లేని లోటు తీర్చలేనిది. అమరుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ విషయాలని విప్లవోద్యమ నిర్మాణానికి విప్లవ కార్యకర్తలంతా బాధ్యతతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ వర్ధంతి సభలో గ్రామ కార్యదర్శి గొల్లపల్లి చంద్రయ్య అధ్యక్షత వహించగా జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గాం మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, పిఓడబ్ల్యు రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి, పీవైఎల్ రాష్ట్ర నాయకులు పెండ్యాల రమేష్, పార్టీ జిల్లా నాయకులు అడేపు శంకర్, మార్త రాములు, కట్ట తేజేశ్వర్, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు బండి అశోక్ లతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page