MLA Kolikapudi : ప్రజా దర్బార్ లో పాల్గొన్న శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 19/12/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమం లో డైనమిక్ శాసనసభ్యులు కొలిక పూడి శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఆ మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, పలు రకాల కు చెందిన సమస్యలతో వినతి పత్రాలు తీసుకొని రావడం జరిగింది. వాళ్ల దగ్గర నుంచి స్వయముగా వస్తున్న వినతి పత్రాలను ఆయన స్వీకరించి, సంబంధిత ఉన్నత అధికారులతో మాట్లాడారు.
వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం చేయాలని ఆదేశించారు. అధికారులు త్వరగానే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలందరూ , శాసనసభ్యులకు మరియు సంబంధిత అధికారులకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Legislators who participated in the Praja Darbar

You cannot copy content of this page

Scroll to Top