
Legislator Receives Applications : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 04; జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన జనసేన ఉద్యమిలైన నాయకులు, జనసైనికులు, వీరమహిళల నుండి వరుసగా ఆరోవ రోజు నిర్మాణ సారధుల దరఖాస్తులను చిత్తూరు పార్లమెంట్ జనసేన పార్టీ పరిశీలకులు, ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మరియు సమాచార సేకరణ కమిటీ సభ్యులు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా ఏడు నియోజకవర్గాలకు ప్రత్యేక డెస్క్‌లు ఏర్పాటు చేసి, పార్టీ కోసం సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన కార్యకర్తల దరఖాస్తులను క్రమబద్ధంగా స్వీకరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe