జూలై 25, 2026
TRINETHRAM NEWS
Har Maa Ke Naam Pe Ek Ped

Har Maa Ke Naam Pe Ek Ped : కూకట్పల్లి జులై 4 (త్రినేత్రం న్యూస్) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన ‘హర్ మా కె నామ్ పే ఏక్ పెడ్’ కార్యక్రమాన్ని ఫతేనగర్‌లో ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్, మైనారిటీ మోర్చా నాయకులు నాసిర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జగన్‌మోహన్ సింగ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు షాజహాన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు ఫతేనగర్‌లోని అరబ్ షా బాబా దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఫతేనగర్ మసీదు సమీపంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, పచ్చని వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page