జూలై 26, 2026
TRINETHRAM NEWS
Regulations Flouted

–రాకపోకలకు ప్రజలు ఇబ్బంది.

గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా …

అధికార పార్టీ అండ దండలతో …..
-ఒక మాజి సర్పంచ్ నిర్వాకం.

-ఒకరికి నీతులు ( మంచి) చెప్పేవారు తప్పు చేస్తే ఎలా ..? అంటూ గ్రామప్రజల విమర్శలు……

Regulations Flouted : చింత పల్లి జులై 04, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో సిసి రోడ్డు మధ్యలో నూతనంగా బోర్ వేయడంతో రాకాపోకలకు అంతరాయం ఏర్పడిందని అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామస్తులు..అధికార పార్టీ అండతో గ్రామ మాజీ సర్పంచ్ ఇష్టారితిగా సి.సి రోడ్డు నడి మధ్యలో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా సొంతంగా బోర్ వేయడం సమంజసం కాదని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.గ్రామంలో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా సీసీ రోడ్డుకు అడ్డంగా బోర్‌వెల్ ఏర్పాటు చేయడం సరైంది కాదని,అది ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా ప్రభుత్వ నిబంధనలకు కూడా విరుద్ధమవుతుందని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆ కాలనీ వాసులకు నిజంగా నీటి సమస్య ఉంటే,ఇప్పటికే సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీ బోర్‌వెల్ నుంచి పైప్‌లైన్ వేసి కాలనీలో ప్రత్యేకంగా నీటి పంపిణీ పాయింట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.ఒకవేళ కొత్త బోర్‌వెల్ అవసరమైతే రోడ్డుకు అడ్డంగా కాకుండా సరైన స్థలాన్ని గుర్తించి గ్రామ పంచాయతీ ద్వారా ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దా మనుకున్నం…మరుసటి రోజు కాలనీలో నీటి సమస్యపై
అధికారుల దృష్టికి తీసుకు వెల్లగా అధికారులు గ్రామానికి వచ్చి పరిస్థితిని పరిశీలించి గ్రామంలో ప్రస్తుతం ఉన్న జనాభాకు అవసరమైన దానికంటే ఎక్కువ బోర్‌వెల్స్ ఇప్పటికే ఉన్నాయని ఈ పరిస్థితుల్లో కొత్త బోర్‌వెల్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేయడంతో ఆ కాలనీకి సమీపంలోని గ్రామ పంచాయతీ బోర్ నుంచే పైప్‌ లైన్ ద్వారా నీటి సరఫరా కల్పిస్తమని చెప్పడం జరిగిందన్నారు.మల్లి అదే ప్రాంతంలో అదే సీసీ రోడ్డుకు అడ్డంగా మళ్లీ బోర్‌వెల్ ఏర్పాటు కోసం గ్రామ మాజీ సర్పంచ్ జోక్యం చేసుకోని..ప్రస్తుత సర్పంచ్ బోర్ ఏర్పాటు చేయడం లేదని ఆరోపిస్తూ…గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా సీసీ రోడ్డు మధ్యలో బోర్ వేయడం సమంజసం కాదని తెలిసినా కూడా మొండిగా ప్రవర్తించిన తీరుపై పలువురు విమర్శలు వినిపిస్తున్నారు.

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, బోర్‌వెల్ ఏర్పాటు నిబంధనల ప్రకారమే జరిగిందా,అవసరమైన అనుమతులు తీసుకున్నారా, ప్రభుత్వ ఆస్తిగా ఉన్న సీసీ రోడ్డుపై బోర్‌వెల్ ఏర్పాటు ఎలా జరిగిందనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.అలాగే ఈ వివాదానికి కారణమైన పరిస్థితులపై విచారణ జరిపి,నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా చర్యలు జరిగి ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page