త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట.. వైసిపి లీగల్ సెల్ జిల్లాలో నిరుపేదలకు,దళితులకు,బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయం అందించి, ప్రజల్లో మంచి పేరు తీసుకొని రావాలనీ, శాసనసభ,శాసన మండలి సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మెన్,శాసన మండలి సభ్యులు, మండపేట అసెంబ్లీ వైసిపి ఇన్ ఛార్జి తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.గురువారం స్థానిక విజయలక్ష్మి నగర్ లో వైసిపి కార్యాలయంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షునిగా ఎంపికైన న్యాయవాది టివి గోవిందరావు ను సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా నియోజకవర్గంలో లీగల్ సెల్ కన్వీనర్ గా గోవిందరావు సమర్ధవంతమైన సేవలను అందించారనీ, వాటిని పరిగణలోకి తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు లీగల్ సెల్ చైర్మెన్ గా టివి గోవిందరావు ను ఎంపిక చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసిపి నాయకులపై నా కార్యకర్తలపై నా అక్రమ కేసులు నమోదు చేస్తుందనీ తోట త్రిమూర్తులు వివరించారు.అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయకుండా లోకేష్ రాసుకొన్న రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు జరుగుతుందన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


