కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాక అనిల్ తోపాటు పలువురునీ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన రవీంద్ర కుమార్
బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 09 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న పెండ్లిపాకుల గ్రామానికి చెందిన పాక అనిల్ తోపాటు పలువురుకి గులాబీ కండువా కప్పి మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు, నేతలు సమన్వయంతో కలిసి పని చేయాలని ఆయన కోరారు.
కేసీఆర్ నేతృత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి గ్రామస్తులకు వివరించి చైతన్యపరచాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం మనదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ బలపరచిన పెండ్లిపాకుల గ్రామ అభ్యర్ధి పాక అనిల్ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎట్టెల్లి రాంబాబు,పిల్లిపరమేష్, నెతళ్ళఎల్లయ్య,కుమార్,బట్టు కొండల్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


