జూన్ 2 న విజయవాడలో….
మండపేట: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వచ్చే నెల 2 న విజయవాడ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారనీ మండపేట నియోజక వర్గ జన సేన పార్టీ వర్గాలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి.
జూన్ 02 వ తేదీ సోమవారం ఉదయం 9:00 గంటలకు విజయవాడ లోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర జలవనరుల నిర్వహణ రైతు శిక్షణ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకకు అందరినీ హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నామనీ పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


