Wall Posters : సమ్మె వాల్ పోస్టర్స్ ను విడుదల చేసిన జేఏసీ సంఘాల నాయకులు

TRINETHRAM NEWS

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9 న జరిగే దేశ వ్యాప్త సమ్మె ను

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి లో జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో సమ్మె వాల్ పోస్టర్స్ ను జేఏసీ సంఘాల నాయకులు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రం లోని బిజేపి ప్రభుత్వం మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని వారు విమర్శించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా విభజించడాన్ని వారు వ్యతిరేకించారు.

ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని, సింగరేణి లో కొత్త గనులు ఏర్పాటు చేయాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, కార్మికుల కు స్వంత ఇంటి పథకం అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని, ప్రతి కార్మికుడికి రిటైర్డ్ ఐన తర్వాత కనీస పెన్షన్ 9వేలు చెల్లించాలని తదితర డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం కు సమ్మె నోటీసు ను అందజేయడం జరిగిందని, కనుక సింగరేణి లో జూలై 9 న జరిగే దేశ వ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలని వారు కార్మికుల ను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో జేఏసీ సంఘాలు ఏఐటియుసి, ఐఎన్టీయుసి, సిఐటియు, టిబిజికేఎస్ మరియు ఐఎఫ్టీయు సంఘాల నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, మిర్యాల రాజిరెడ్డి, మెండె శ్రీనివాస్, కే.విశ్వనాథ్ తో పాటు సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Leaders of JAC unions

You cannot copy content of this page

Scroll to Top