Law Awareness : చట్టాలపై అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా శ్రీ అనంత పద్మనాభ డిగ్రీ కళాశాలలొ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ డి.బి. శీతల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో వాహనాలు నడిపే యువకులు కచ్చితంగా చట్టంలోని నిబంధనలు పాటించాలని వివరించారు, కళాశాలలో ఎవరు కూడా ర్యాగింగ్ చేయకూడదని అందుకు సంబంధించిన చట్టాలు కఠిన శిక్షలు విధిస్తాయని వివరించారు, చట్టాలపై అవగాహన కలిగి ఉండడం మంచిదని వివరించారు.

సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మెలుగాలని ఆకాంక్షించారు. మెయింటెనెన్స్ గురించి, పోలీసులకు దరఖాస్తు ఏ విధంగా ఇవ్వాలి అని విషయాల గురించి, కుటుంబ వ్యవస్థలో ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని న్యాయవాదులు వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ టి. వెంకటేష్ డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి రాము , అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం. శ్రీనివాస్ ప్యానల్ న్యాయవాది రాజశేఖర్ కళాశాల ప్రిన్సిపల మరియు బోధన సిబ్బంది పాల్గొన్నారు.

Law Awareness Conference

You cannot copy content of this page

Scroll to Top