జూన్ 26, 2026
TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 26 : కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య కార్యవర్గ సభ్యులతో కలిసి ఎమ్మార్వో కార్యాలయంలో ప్రెస్ క్లబ్ స్థలం, భవన నిర్మాణానికి కావాల్సిన ప్రభుత్వ భూమిలో స్థలాన్ని కేటాయించాలని డిప్యూటీ తహసిల్దార్ వినయ్ కుమార్ కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్ వినతి పత్రంపై మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి పై అధికారులను సంప్రదించి,త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

దీంతో డిప్యూటీ తాసిల్దార్ హామీపై ప్రెస్ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు,వి.సుజాత, మీడియా కన్వీనర్ దుర్గాప్రసాద్,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.లక్ష్మి,ఈసీ మెంబర్ ప్రభాకర్ రెడ్డి,కర్ణ కుమార్, అనిల్ కిషోర్, బాబీ కాంత్, వినీల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kukatpally Press Club site

You cannot copy content of this page