KTR : అరెస్ట్‌కు ప్రిపేర్ అయిపోయిన కేటీఆర్

TRINETHRAM NEWS

అరెస్ట్‌కు ప్రిపేర్ అయిపోయిన కేటీఆర్ !

Trinethram News : Telangana : ఫార్ములా ఈ కార్ కేసు విషయంలో జరిగిన రూ. 55 కోట్ల గల్లంతు వ్యవహారంలో తనను అరెస్టు చేస్తారని కేటీఆర్ మెంటల్ గా ప్రిపేర్ అయిపోతున్నారు. తనను అరెస్టు చేస్తారని రెండు నెలలు జైల్లో పెట్టినా సిద్దమేనని ఆయన ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. రెండు నెలల పాటు యోగా చేసి పాదయాత్రకు సిద్దమవుతానని చెప్పుకొచ్చారు.

ఫార్ములా ఈ రేసు కోసం తాము నిర్వహణ సంస్థకు రూ. 55 కోట్లు ఇచ్చామన్నది నిజమేని అయితే అది ప్రభుత్వ నిర్ణయం అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఆ రేసు నిర్వహించామన్నారు. అంతకు ముందు స్పాన్సర్ చేసిన గ్రీన్ కో కంపెనీ రెండో విడత స్పాన్సర్ చేయలేదని.. అందుకు నిర్వహణ ఖర్చును తామే భరిస్తామని నిర్వహణ కంపెనీకి చెప్పామన్నారు. అందులో భాగంగానే రూ. 55కోట్లు బదిలీ చేశామన్నారు. ఈ రేసును క్యాన్సిల్ చేసినందునకు.. రేవంత్ రెడ్డిపైనే కేసులు పెట్టాలన్నారు.

అయితే రూ. 55 కోట్లు విదేశీ కంపెనీకి బదిలీ చేశారు కానీ.. దానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ నిధులను బదిలీ చేయడానికి కనీసం చిన్న అనుమతి కూడా ఎవరూ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ నిర్ణయం అని కేటీఆర్ చెబుతుననా.. కేబినెట్‌లో కనీసం నిర్ణయం తీసుకోలేదని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే కేటీఆర్ చెబితేనే బదిలీ చేశామని నాటి కీలక అధికారి అర్వింద్ కుమార్ స్పష్టమైన వివరణ ప్రభుత్వానికి ఇచ్చారు. ఏసీబీ త్వరలో నోటీసులు జారీ చేస్తుందని ప్రచారం జరుగుతున్న సమయంలో అరెస్టుకు తాను సిద్ధమని కేటీఆర్ అంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top