WhatsApp Image 2024 11 19 at 20.47.01
కేసీఆర్ నీ పార్టీని మొలకెత్తనీయం : రేవంత్
Trinethram News : వరంగల్ : బీఆర్ఎస్ పార్టీని తొక్కేశామని మళ్లీ మొలకెత్తనీయబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరంగల్ లో నిర్వహించిన ప్రజాపాలన వార్షిక విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి దూకుడైన ప్రసంగం చేశారు. ఎవరో ఇస్తే తాను ఈ పదవిలోకి రాలేదని తొక్కుకుంటూ ఇక్కడి వరకూ వచ్చానన్నారు. ఒక్క సారి ఓడిస్తే కేసీఆర్ ప్రజల మొహం కూడా చూడటం లేదన్నారు. కేసీఆర్ బయటకు రాకుండా ఇద్దరు చిల్లరగాళ్లను తనపైకి వదిలారని కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని అసెంబ్లీకి ఎవరు వస్తారో తేల్చుకోవాలని సవాల్ చేశారు.
ప్రజలు సంతోషంగా ఉన్నారని కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండాలన్నారు. నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ ప్రజల మధ్యకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఓడిస్తానని గతంలో చెప్పానని ఓడించానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా వచ్చేలా చేస్తానన్నాని అంతే వచ్చాయన్నారు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు కేసీఆర్ అని మండిపడ్డారు. మూడు సార్లు ఓడినా రాహుల్ గాంధీ ప్రజల్లోనే ఉన్నారని ఆయనను చూసి కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలన్నారు. .
వరంగల్ ను అభివృద్ధి చేస్తే తెలంగాణ సగం అభివృద్ధి చేసినట్లేనన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్ ను అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళకనకు వ్యతిరేకమని ప్రకటించిన కిషన్ రెడ్డిపైనా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయనపై ఉన్న గౌరవం అంతా పోయిందన్నారు. సబర్మతి ప్రక్షాళన చేస్తే చప్పట్లు కొట్టారని అదే మూసికి మాత్రం అడ్డం పడతామంటున్నారని మండిపడ్డారు. కొంత మందిరైతులకు సాంకేతిక కారణాల వల్ల రుణ మాఫీకాలేదని అందరికీ చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ భరోసా ఇచ్చారు.
ఏడాది పాలనలో తాము అనేక విజయాలు సాధించామని ప్రజలను మెప్పించేలా పాలన చేశామని రేవంత్ నమ్మకంగా ఉన్నారు. అందుకే విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
