KCR : రంగంలోకి దిగిన కేసీఆర్… రేపు ముఖ్య నేతలతో కీలక సమావేశం

TRINETHRAM NEWS

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

రేపు ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం

ఎన్నికల ప్రచారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్

సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదల

క్షేత్రస్థాయిలో కేసీఆర్ ప్రచారంపై కొనసాగుతున్న సందిగ్ధత

Trinethram News : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి, ఎన్నికల వ్యూహరచనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రేపు తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఉపఎన్నిక ప్రచార సరళిపై చర్చించి, నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ అర్ధాంగి మాగంటి సునీతను ప్రకటించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

KCR enters the fray

You cannot copy content of this page

Scroll to Top