Guntipati Kondappa Naidu : కావలి మున్సిపల్ మినీ స్టేడియం కు మాజీ శాసన సభ్యులు గుంట్టిపాటి కొండప్ప నాయుడు పేరు పెట్టాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 21 :నెల్లూరు జిల్లా :కావలి.. కావాలి మున్సిపల్ మినీ స్టేడియం కు మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి కొండపనాయుడు పేరును పెట్టాలని రాష్ట్ర బీ.జే.పీ నాయకులు కంచర్ల మురళీకృష్ణ నాయుడు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ బోర్డ్ చైర్మన్ రవి నాయుడు ను కోరారు మంగళవారం విజయవాడ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో చైర్మన్ రవి నాయుడు ను కంచర్ల తన ప్రతినిధి బృందం తో కలిశారు,

ఈ సందర్భంగా కంచర్ల మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతు కావలి నియోజకవర్గ అభివృద్ధి కి ఎనలేని సేవలు చేసిన సీనియర్ రాజకీయ నాయకుడు దివంగత నేత గొట్టిపాటి పేరును కావలి స్టేడియం కి పెట్టడం సముసితంగా ఉంటుందన్నారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతున్న రోజుల్లోనే 1972 లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన ఘనత గొట్టిపాటి ది అన్నారు ఇప్పటికీ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఎన్నో రూపాల్లో కనిపిస్తూ ఉంటుందని అలాంటి వ్యక్తి పేరును స్టేడియం కు పెట్టడం రాబోయే తరాలు ఆయన్ను గుర్తుంచుకునే లా చేస్తుందన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kavali Municipal Mini Stadium to be named

You cannot copy content of this page

Scroll to Top