Kavali MLA : సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :మార్చ్ 5: నెల్లూరు జిల్లా: కొండ బిట్రగుంట .. బోగోలు మండలం: కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారు సూర్యప్రభ వాహనంపై ఆలయ ప్రాంగణంలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kavali MLA participates in Suryaprabha Vahana Seva

You cannot copy content of this page

Scroll to Top