MLA Kavya Krishna Reddy : సయ్యద్ సుభాని భాషను పరామర్శించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :జనవరి 10: నెల్లూరు :జిల్లా కావలి.. కావలి నియోజకవర్గ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ సుభాని భాష చెన్నై విజయ హాస్పిటల్‌లో కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి , శనివారం నెల్లూరులోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.సయ్యద్ సుభాని భాష ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే , వైద్యులు సూచించిన విధంగా చికిత్సను పాటిస్తూ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పి .ఏ. సి .ఎస్, ప్రెసిడెంట్ చిలకపాటి వెంకటేశ్వర్లు, మాజీ సోమశిల చైర్మన్ కండ్లగుంట మధు బాబు నాయుడు,ఐటీడీపి అధ్యక్షులు గోచిపాతల సంజయ్, పులిందల వినోద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kavali MLA Kavya Krishna Reddy visits Syed Subhani Bhasha

You cannot copy content of this page

Scroll to Top