త్రినేత్రం న్యూస్ :జనవరి 4: నెల్లూరు జిల్లా :కావలి : శ్రీ మేధా నృత్య కళానిలయం విద్యార్థుల చారిత్రక విజయం భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్ 27న నిర్వహించిన భారీ కూచిపూడి నృత్య కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన సందర్భంగా, కావలి పట్టణానికి చెందిన శ్రీ మేధా నృత్య కళానిలయం నృత్య బృందం ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ నృత్య బృందానికి గురువుగా ఉన్న కోవూరు సరయు కృష్ణ నేతృత్వంలో 13 మంది చిన్నారులు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులో పాల్గొని రికార్డును కైవసం చేసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో వేలాది మంది బాలబాలికలు ఏకకాలంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పగా, అందులో కావలి ప్రాంతానికి చెందిన చిన్నారుల భాగస్వామ్యం పట్టణ ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. సంప్రదాయ భారతీయ నృత్యకళను ప్రపంచ వేదికపై నిలబెట్టడంలో శ్రీ మేధా నృత్య కళానిలయం విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకొని ఈరోజు కావలి ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ,గురువు సరయు కృష్ణతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డులో పాల్గొన్న చిన్నారులను చిరు సత్కారంతో ఘనంగా అభినందించి ఆశీర్వదించారు. చిన్నారుల ప్రతిభను ప్రశంసిస్తూ, వారి భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,చిన్న వయసులోనే శాస్త్రీయ నృత్యకళలో ప్రావీణ్యం సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డు స్థాయిలో పాల్గొనడం అత్యంత గర్వకారణం.
గురువు కోవూరు సరయు కృష్ణ శిక్షణ, కృషి వల్లే ఈ పిల్లలు ఇంత గొప్ప విజయం సాధించారు. కావలి పేరు ప్రపంచ పటంలో నిలిచేలా చేసినందుకు వారందరికీ హృదయపూర్వక అభినందనలు ,అని అన్నారు.తల్లిదండ్రులు పిల్లలను కళల వైపు ప్రోత్సహించడమే కాకుండా, గురువులపై నమ్మకం ఉంచి అండగా నిలవడం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా కావలి ప్రాంతంలోని కళా ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


