త్రినేత్రం న్యూస్: జనవరి 3: నెల్లూరు జిల్లా : కావలి పట్టణం జాయ్ లూస్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్‌లో పి.ఏ.బి.సి.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏడు రాష్ట్రాల సంఘాల నాయకులు రెవ డాక్టర్ జి.డి.డి దివాకర్ జన్మదిన వేడుకలు శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ జన్మదిన వేడుకలకు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి , ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకి రెవ డాక్టర్ జి.డి.డి దివాకర్ తో పాటు సంఘ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కి, శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రెవ డాక్టర్ జి.డి.డి దివాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు స్వయంగా పాల్గొని దివాకర్ ని, అభినందిస్తూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ,దివాకర్ అన్న అంటే నాకు ఎంతో ఇష్టమని.నా రాజకీయ జీవితంలో నా గెలుపు కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన చేసిన మేలును నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
సొంత ఊరు కోసం ఏదో ఒకటి చేయాలనే తపన కలిగిన వ్యక్తి దివాకర్ అలాంటి వ్యక్తి జీవితంలో ఇలాంటి సంతోషకరమైన సందర్భంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు.రెవ డాక్టర్ జి.డి.డి దివాకర్ మాట్లాడుతూ,తన జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ,ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సేవలో ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే , నాయకత్వంలో కావలి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, పాస్టర్లు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రెవ డాక్టర్ జి.డి.డి దివాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


