WhatsApp Image 2024 11 18 at 14.19.22
కార్తిక సోమవారం.. విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ..
Trinethram News : అమరావతి
కార్తిక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో సందడి నెలకొంది. భక్తులు వేకువజాము నుంచే దర్శనాలకు తరలివచ్చారు..
శ్రీశైలం, విజయవాడ, రాజమహేంద్రవరం, వేములవాడ, భద్రాచలం ప్రాంతాల్లోని ఆలయాల్లో రద్దీ నెలకొంది. కృష్ణా, గోదావరి నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అనంతరం నదుల్లో దీపాలు వదిలారు. ఆ తర్వాత పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ లోని కృష్ణా తీరానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో అక్కడ ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
