Hunger Strike By MLA : కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ చేస్తున్న రిలే నిరహార దీక్షకు మద్దత్తు తెలిపిన కర్కనాగరాజు

TRINETHRAM NEWS

కూకట్పల్లి జనవరి 27 (త్రినేత్రం న్యూస్) : గ్రేటర్ హైదరాబాద్ అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం గ్రేటర్ అధ్యక్షులు, టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ కార్యదర్శి కర్క నాగరాజు ఆధ్వర్యంలో ఈ రోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ చేస్తున్న రిలే నిరాహార దీక్షకు కూకట్పల్లి నియోజకవర్గం నుండి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తన నిరంకుశ వైఖరితో కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రజాస్వామ్యం లేకుండా నామినేటెడ్ వ్యవస్థతో కంటోన్మెంట్ ప్రజలపై చేస్తున్న రాచరిక పాలనకు వ్యతిరేకంగా, కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్ తో గత 7 రోజులుగా కార్ఖానా లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరానికి వెళ్లి తమ సంఘీభావాన్ని తెలియజేసి, కంటోన్మెంట్ ప్రాంత ప్రజల బాధ్యతను,వారి అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పి, నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి కంటోన్మెంట్ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని కేంద్రం లోని బిజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కంటోన్మెంట్ ప్రాంత ప్రజల గొంతును ఢిల్లీ వరకు చేరేలా కృషి చేస్తున్న గణేష్ ని అభినందించారు.

ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుని వారి దీక్షకు సంఘీభావం తెలియజేసారు.ఈ కార్యక్రమంలో వడ్డే నాగార్జున,కర్కమహేష్, రమేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Karkanagaraju supports the relay hunger strike by Cantonment MLA Ganesh

You cannot copy content of this page

Scroll to Top