MLA Sri Ganesh : క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

TRINETHRAM NEWS

Trinethram News : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో తిరుమలగిరి లాల్ బజార్ లోని గారిసన్ వెస్లీ చర్చ్ లో క్రిస్మస్ కంటాట కార్యక్రమం, క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు .ఈ వేడుకలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై ఏసుక్రీస్తు బోధనలైన ప్రేమ,సేవ త్యాగం,క్షమల ప్రవర్తనతో నడవాలని, ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరించి ప్రజలందరూ శాంతి, సౌభ్రాతృత్వాలతో జీవించాలని చెప్పి,ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన పాస్టర్ లకు అభినందనలు తెలిపి, అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, పాస్టర్లు అరుణ్, జూలియస్,జీవరత్నం, మనోహర్,యోనా, సతీష్ దివాకరన్, మహేష్ సుధీర్,జెరోమ్,ఆనంద కుమార్, దినకరన్,సోలోమన్,రాజేశ్వర్ సోలోమన్,శాంసన్ సూర్యకాంత్ తదితరులు ఉన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cantonment MLA Sri Ganesh participated in Christmas celebrations

You cannot copy content of this page

Scroll to Top