
Kargil Vijay Diwas : దేవరకొండ డివిజన్ జులై 26, త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్ వీ టి మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై 26 న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటారని. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత సైన్యం విజయం సాధించిన, 527 మంది ప్రాణాలు త్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకునే ముఖ్యమైన రోజు ఇది అని, పాకిస్థాన్ సైనికులు లద్దాఖ్‌లోని కార్గిల్ పర్వత శిఖరాలను ఆక్రమించగా, వారిని తరిమికొట్టేందుకు భారత్ ఈ సైనిక చర్య చేపట్టింది భీకర పోరాటం మంచుతో కూడిన కఠినమైన కొండలపై భారత సైనికులు సుమారు రెండు నెలల పాటు ప్రాణాలకు తెగించి పోరాడి విజయం సాధించారని, దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన 527 మంది వీర సైనికులకు ఈ రోజున ఘన నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం తప్పనిసరి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, పి జె శాంసన్ ,భాస్కర్ రెడ్డి, వల్లమళ్ల ఆంజనేయులు, తాళ్ల సురేష్ ,జగదీశ్వరా చారి, సైదులు ,నాగు, సంజీవ, రాజు, కుమార్, అంజి, వాసుదేవుడు, నాగార్జున ,అభిరామ్, చరణ్ ,వంశీ, క్రీడాకారులు కళాకారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe