AITUC : కాకినాడ జి జి హెచ్ సూపరిడెండెంట్ సెక్యూరిటీ గార్డ్స్ కి జీ.ఓ138 ప్రకారంగా జీతాలు ఇప్పించండి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, కాకినాడ,నవంబర్,10: ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి అనుబంధ సంఘం, ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ జిజిహెచ్ లో 12 గంటలకు మాతా శిశు విభాగం వద్ద 138 జీవో ప్రకారంగా జీతాలు మంజూరు చేయాలని యూనియన్ అధ్యక్షులు కె.వి రామయ్య అధ్యక్షతన నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు.

ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ ఎబాలిషన్ యాక్ట్ 1970 ప్రకారంగా, వైద్యఆరోగ్య శాఖ అధికారులతో, మంత్రివర్యులతో చేసుకున్న ఒప్పంద నియమ నిబంధన ప్రకారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కు 138 జీవో ప్రకారంగా 18600 మంజూరు చేయాలని, సి.ఎల్ అమలు చేయాలని, అదనపు డ్యూటీల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని, యూనిఫామ్ కుట్టుకూలీ తక్షణమే ఇవ్వాలని, జీతం పే స్లిప్పులు మంజూరు చేయాలని, పి.ఎఫ్, ఈ ఎస్ ఐ కార్మికుల ఖాతాల్లో ఎంత జమైనదో కంప్యూటర్ ఆపరేటర్ నియమించి సమాచారం తెలియజేయాలని,జీవో ప్రకారంగా జీతాలు మంజూరు చేసేందుకు ఆసుపత్రి సూపరిండెంట్ జోక్యం చేసుకోవాలని, కాంట్రాక్టర్ ని పిలిచి మాట్లాడి కనీస వేతనాలు అమలు చేయించాలని, కాంట్రాక్టర్ కి ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని సూపర్డెంట్, తక్షణమే స్పందించాలని,శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ కాంట్రాక్టర్లు వేరైనా శానిటేషన్ కార్మికులకు జీవో ప్రకారంగా జీతాలు మంజూరు మంజూరు చేస్తున్నారని, కానీ సెక్యూరిటీ గార్డ్స్ కు మాత్రం జీవో ప్రకారంగా జీతాలు అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్. అనిల్ కుమార్, ఎం. రాజేందరరావు, నాయుడు అప్పరావు, డేగల మధు, పితాని రమణ, షేక్ మీరాబి, ఆవుల లోవ కుమారి, కాటూరి రాజు, లిల్లీ, లక్ష్మి, దేవి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kakinada GGH Superintendent Security Guards

You cannot copy content of this page

Scroll to Top