త్రినేత్రం న్యూస్ మొదటి సోమవారం ఉదయం 10:00 నుండి కడియం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశము జేగురుపాడు గ్రామములో బైబిల్ మిషన్ పరిచర్య చేస్తున్న రెవ. ఎస్ మహిమ రాజు మందిరములో ఆశీర్వాదకరంగా జరిగింది. ఈ సమావేశమునకు వైస్ ప్రెసిడెంట్.బిషప్.జీవరత్నం అధ్యక్షత వహించగా జిల్లా ఫెలోషిప్ నాయకులు జిల్లా వైస్ ప్రెసిడెంట్ రెవ. కరుణాకర్ రీజనల్ చైర్మన్ రెవ. పరంజ్యోతి , మండల ప్రెసిడెంట్ రెవ.
మోదీ సేవకులను ఉద్దేశించి శ్రేష్టమైన వాక్య సందేశములు అందించారు.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జేగురుపాడు గ్రామ పంచాయితీ సర్పంచ్ శ్రీ యాదల.సతీష్ చంద్ర స్టాలిన్ నేటి కాలంలో క్రైస్తవ సేవకులపై జరుగుతున్న దాడులను ఖండించి, సేవకులను ఉద్దేశించి వారి అమూల్యమైన శుభాలు అందించారు. అలాగే కడియం మండల బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాజ్ కుమార్, బైబిల్ మిషన్ ధవలేశ్వరం యాజకులు రెవ.సామ్యూల్, రెవ. దివాకర్ శుభాలు తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో ఇటీవల అనారోగ్యమునకు గురైనటువంటి మైక్ సామ్యూల్ మరియు ఎలిపే యేసు రత్నం కి ఫిలోషిప్ తరఫున 4 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయుట జరిగింది. ఫెలోషిప్ ఏర్పాటు చేసుకున్న దైవజనులు రెవ. ఎస్ మహిమ రాజు ఫెలోషిప్ పెద్దలను కమిటీ సభ్యులను దుస్సాలువ, పూలమాలలతో ఘనముగా సత్కరించారు.అలాగుననె ఫెలోషిప్ కమిటీ వారు కార్యక్రమమును ఏర్పాటు చేసిన రెవ. మహిమరాజు ని ఫెలోషిప్ తరపున ఘనముగా సత్కరించిరి.
చివరిలో కార్యక్రమ నిర్వాహకులు రెవరెండ్ ఎస్ మహిమ రాజు వచ్చిన సేవకులందరికి వారి సంఘము తరపున ఘనమైన ఆశీర్వాదపు విందు ఏర్పాటు చేసి, ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చి సత్కరించిరి ఈ కార్యక్రమములో రిజనల్ జాయింట్ సెక్రటరీ రెవ. జయశీల్, ఫెలోషిప్ ట్రెజరర్ సిహెచ్ రత్నదీప్, సెక్రటరీ పాస్టర్ సామ్యూల్ రాజ్,జాయింట్ సెక్రటరీ ఏసురత్నం, డాక్టర్ డి రత్నరాజు,బిషప్ సొలోమోను, రెవ. ప్రసన్నకుమార్ రెవ. నక్క. యషయ్య రెవ. రాకడరావు మరియు మండల సేవకులందరూ ఏకీభవించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


